పెందుర్తి: కరోనా విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలు తెరవడం వైసీపీ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయమని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పక్క రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే ఇక్కడి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. కరోనా పెద్ద సమస్య కాదంటున్న ప్రభుత్వం ఇకనైనా ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడానని మాధవ్ తెలిపారు.