ఇప్పుడైనా ‘క్యాంటీన్‌’లను తెరవండి: కేశినేని

ABN , First Publish Date - 2020-03-29T08:48:30+05:30 IST

అన్న క్యాంటీన్లపై విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) శనివారం ట్విటర్‌లో స్పందించారు. ‘‘మూసివేసిన అన్న క్యాంటీన్‌లను ఇప్పుడైనా తెరవండి...

ఇప్పుడైనా ‘క్యాంటీన్‌’లను తెరవండి: కేశినేని

విజయవాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్లపై విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) శనివారం ట్విటర్‌లో స్పందించారు. ‘‘మూసివేసిన అన్న క్యాంటీన్‌లను ఇప్పుడైనా తెరవండి.. కావాలంటే మీకు కావలసిన పేరు పెట్టుకోండి.. ఇలాంటి సమయంలో ప్రజలకు చాలా ఉపయోగపడతాయి.. సలహా మాత్రమే’’ అని ట్వీట్‌ చేశారు. ‘పోలీసులకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. దయచేసి సహకరించండి’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘‘అమరావతి రైతులకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. వారిని చిత్రహింసలు పెట్టినప్పుడు ఇవన్నీ గుర్తు లేవా డీజీపీ గారూ?’’ అంటూ ఎంపీ కేశినేని నాని మరో ట్వీట్‌ను పోస్టు చేశారు. 


Updated Date - 2020-03-29T08:48:30+05:30 IST