రేపటి నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-04-09T02:19:40+05:30 IST

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 19వ తేదీ వరకు

రేపటి నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు

రాజంపేట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 19వ తేదీ వరకు అంగరంగవైభవంగా జరగనున్నాయి. రెండేళ్లుగా కొవిడ్‌తో ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. కొవిడ్‌ ప్రభావం పూర్తిగా తగ్గడంతో ఈ ఏడాది ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 15వ తేదీన జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి గవర్నర్‌, ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌, జేసీ సాయికాంత్‌వర్మల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు.

Updated Date - 2022-04-09T02:19:40+05:30 IST