రోజుకు నాలుగు కేసులే అమ్మాలి

ABN , First Publish Date - 2022-07-22T08:15:40+05:30 IST

రోజుకు నాలుగు కేసులే అమ్మాలి

రోజుకు నాలుగు కేసులే అమ్మాలి

చీప్‌ లిక్కర్‌ అమ్మకాలపై ఆంక్షలు

తాము ఆదేశించలేదన్న బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ


అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖ చీప్‌ లిక్కర్‌ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. ఒక్కో షాపులో రోజుకు 4 కేసుల లిక్కర్‌ మాత్రమే విక్రయించాలని షాపుల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీఅయ్యాయి. క్వార్టర్‌ రూ.120, రూ.130 విలువగల బ్రాండ్ల మద్యాన్ని ఉదయం ఒక కేసు, మద్యాహ్నం ఒక కేసు, సాయంత్రం రెండు కేసులు అమ్మాలని స్పష్టంచేశారు. ఈ మేరకు జిల్లాల్లో అధికారిక వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పెట్టారు. రూ.140 నుంచి పైన ఉండే మద్యంపై ఎలాంటి ఆంక్షలు లేవని అందులో తెలియజేశారు. కాగా దీనిపై బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేషన్‌ నుంచి అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పారు. జిల్లాల్లో ఇలాంటి ఆదేశాలిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-07-22T08:15:40+05:30 IST