యూకేలో GCSE బోర్డు తెలుగును గుర్తిస్తుందా?

ABN , First Publish Date - 2021-12-14T02:11:55+05:30 IST

తెలుగు భాషని GCSE (General Certificate of Secondary Education) బోర్డు సబ్జెక్ట్‌‌గా యూకేలో ప్రవేశపెట్టాలని పిటీషన్ ఉద్యమం నడుస్తోంది. యూకేలో 50 వేల మంది తెలుగు వాళ్లు ఉన్నారని, కానీ, GCSE బోర్డు సబ్జెక్ట్‌గా తెలుగు లేదని ఈ పిటీషన్ క్రియేట్ చేసి, ఈ-సంతకాల ఉద్యమం ప్రారంభించిన హేమ ఎల్లాప్రగడ అన్నారు.

యూకేలో GCSE బోర్డు తెలుగును గుర్తిస్తుందా?

తెలుగు భాషని GCSE (General Certificate of Secondary Education) బోర్డు సబ్జెక్ట్‌‌గా యూకేలో ప్రవేశపెట్టాలని పిటీషన్  ఉద్యమం నడుస్తోంది.  యూకేలో 50 వేల మంది తెలుగు వాళ్లు ఉన్నారని, కానీ, GCSE బోర్డు సబ్జెక్ట్‌గా తెలుగు లేదని ఈ పిటీషన్ క్రియేట్ చేసి, ఈ-సంతకాల ఉద్యమం ప్రారంభించిన హేమ ఎల్లాప్రగడ అన్నారు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు 3వ స్థానంలో ఉందని, ప్రపంచంలో 15వ స్థానంలో ఉందని అందులో ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ జనరల్ సర్టిఫికేట్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌గా తెలుగు అందుబాటులో లేదు. ‘‘GCSEబోర్డులో తెలుగుని ప్రవేశపెట్టి తెలుగు మాతృ  భాష అయిన వారికి ప్రయోజనం చేకూర్చవల్సిందిగా కోరుతున్నాము’’ అని ఆమె యూకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 


యూకేలో హెరిటేజ్ లాంగ్వేజ్ మాట్లాడేవారిలో ఎక్కువ మంది తమ భాషలో జీసీఎస్సీ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంది. కానీ, తెలుగు వారికి ఆ అవకాశం లేకుండా పోయిందని పిటీషనర్ వాపోయారు. ఏ పిటీషన్ మీద 10 వేల సంతకాలు సేకరించగలిగితే అది ప్రభుత్వ స్పందనకు నోచుకుంటుంది. లక్ష సంతకాలు సేకరించగలిగితే బ్రిటీష్ పార్లమెంటులో చర్చకు అర్హత పొందుతుంది. కాగా, తెలుగుని GCSE బోర్డు సబ్జెక్ట్‌గా గుర్తించమని కోరుతున్న ఈ పిటీషన్ కు ముగింపు తేదీ డిసెంబర్ 22 కాగా, ఇంతవరకూ 8,230 సంతకాలు మాత్రమే వచ్చాయి. 

         ఆన్‌లైన్ పిటిషన్..  https://petition.parliament.uk/petitions/589057

                        

Updated Date - 2021-12-14T02:11:55+05:30 IST