ఫండ్ రైజర్ల కోసం మిలాప్ 0% ప్లాట్ ఫాం

ABN , First Publish Date - 2020-08-19T00:27:42+05:30 IST

ఆన్ లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం మిలాప్ సరికొత్త 0% ఫీజు విధానాన్ని పరిచయం చేసింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి రాబోయే పండుగ సీజన్‌ వరకూ ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ ఫీజును..

ఫండ్ రైజర్ల కోసం మిలాప్ 0% ప్లాట్ ఫాం

హైదరబాద్: ఆన్ లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం మిలాప్ సరికొత్త 0% ఫీజు విధానాన్ని పరిచయం చేసింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి రాబోయే పండుగ సీజన్‌ వరకూ ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ ఫీజును మిలాప్‌ పరిచయం చేసింది. దీంతో మిలాప్‌ మరింత మంది ప్రజలకు చేరువ కానుంది. అంతేకాకుండా వీలైనంత త్వరగా అవసరార్ధులకు సహాయాన్ని అందించగలుగుతుంది. ఈ సంధర్భంగా మిలాప్‌ కో ఫౌండర్ అండ్ సీఈవో మయూఖ్‌ చౌదరి మాట్లాడారు. ‘గత కొద్ది నెలలుగా, కోవిడ్‌ –19 మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రజల నుంచి అపూర్వమైన ఔదార్యాన్ని చూశాం.  వేలాది మంది మిలాప్‌పై నిధులను సమీకరించడంతో పాటుగా ఆపదలో ఉన్న లక్షలాది మందికి సహాయపడ్డారు. ఈ సహాయానికి చిహ్నంగా వారందరికీ కృతజ్ఞతతో ఉచితంగా మిలాప్ ను అందిస్తున్నాం. అందువల్ల, రాబోతున్న పండుగ సీజన్‌ వేళ ఫండ్‌ రైజర్లందరికీ  0% ఫీజును విస్తరించడంపై పరిపూర్ణంగా దృష్టి పెట్టామ’ని పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే సాధారణంగా ఫండ్‌ రైజింగ్‌ కోసం 5% ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేస్తుంటారు. వ్యక్తిగత ఫండ్ రైజర్లు, చారిటబుల్‌ సంస్థలకు ఒకేలా ఈ ఫీజులు ఉంటాయి. దీంతో తాజాగా ప్రకటించిన 0% మిలాప్‌ ప్లాట్‌ఫామ్‌ ఫండ్‌ రైజింగ్‌ ఫీజులు మాత్రం ఫండ్‌ రైజర్లందరికీ వర్తించనున్నాయి. ఇప్పటి వరకూ హైదరాబాద్‌ ఫండ్‌ రైజర్లు సంయుక్తంగా రూ.74 కోట్లను సమీకరించారు. వీటిలో దాదాపు 90% నిధులు వైద్య పరమైన కారణాల కోసమే సేకరించడం జరిగింది.

Updated Date - 2020-08-19T00:27:42+05:30 IST