ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. ఏజీ అండ్ పీ ప్రథమ్ సీఎన్‌జీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-06-10T00:28:09+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) పరిశ్రమలో

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. ఏజీ అండ్ పీ ప్రథమ్ సీఎన్‌జీ ర్యాలీ

కడప: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) పరిశ్రమలో అగ్రగామి సంస్థ అయిన ఏజీ అండ్ పీ ప్రథమ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ‘గ్రీన్ వీల్స్ సీఎన్‌జీ ర్యాలీ’ నిర్వహించింది.


సీఎన్‌జీతో కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఎర్రముక్కపల్లి సర్కిల్‌ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నూతన బస్టాండ్‌ సర్కిల్‌ వరకూ 5 కిలోమీటర్ల మేర సాగింది. ఓఈఎం డీలర్‌షిప్స్‌ అయిన హరున్‌ బజాజ్‌, పియాజ్జియో వంటి వాటి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ ర్యాలీలో అన్ని విభాగాల సీఎన్‌జీ వాహనాలైన ఆటోలు, కార్లు, చిన్న, కమర్షియల్‌ వాహనాలు కూడా పాల్గొన్నాయి. సీఎన్‌జీకి ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌  ‘మెగా సీఎన్‌జీ ఎక్సేంజ్‌ మేళా’ను కూడా నిర్వహించింది. 

Updated Date - 2022-06-10T00:28:09+05:30 IST