ఒమైక్రాన్ కేసులు ప్రతి 2 రోజులకోమారు రెట్టింపవుతాయి: యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు

ABN , First Publish Date - 2021-12-16T03:38:07+05:30 IST

మరో నెల రోజుల తరువాత కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ఐరోపా ఖండంలో ప్రబల వేరియంట్‌గా మారుతుందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు అర్సులా లేయన్ తాజాగా వ్యాఖ్యానించారు.

ఒమైక్రాన్ కేసులు ప్రతి 2 రోజులకోమారు రెట్టింపవుతాయి: యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు

బ్రస్సెల్స్: మరో నెల రోజుల తరువాత కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ఐరోపా ఖండంలో ప్రబల వేరియంట్‌గా మారుతుందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు అర్సులా లేయన్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రతి రెండు మూడు రోజులకోసారి ఒమైక్రాన్ కేసులు రెట్టింపవుతాయని అంచనా వేశారు. ఇది చాలా ఎక్కువని కూడా ఆమె పేర్కొన్నారు. అయితే.. ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఐరోపా సమాఖ్య పూర్తి సన్నద్ధతతో ఉందని, అక్కడి జనాభాలో 66 శాతం మంది ఇప్పటికే  కరోనా టీకా పొందారని ఆమె తెలిపారు. 


కాగా.. ఒమైక్రాన్‌తో కలిగే వ్యాధి లక్షణాలు ఓ మోస్తరు తీవ్రతతో మాత్రమే ఉంటాయని పలువురు భావిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఒక వేళ ఇది నిజమేనని అనుకున్నా...వేగంగా పెరిగే కేసుల కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరవుతాయి’’ అని ఆయన హెచ్చరించారు. ఒమైక్రాన్ పట్ల జాగరూకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.  

Updated Date - 2021-12-16T03:38:07+05:30 IST