భారత్‌కు ప్రయాణాలొద్దు.. దేశ పౌరులను హెచ్చరించిన ఒమన్

ABN , First Publish Date - 2021-04-18T13:03:15+05:30 IST

భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఒమన్ ఎంబసీ తమ దేశ పౌరులను హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు భారత్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది.

భారత్‌కు ప్రయాణాలొద్దు.. దేశ పౌరులను హెచ్చరించిన ఒమన్

న్యూఢిల్లీ: భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఒమన్ ఎంబసీ తమ దేశ పౌరులను హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు భారత్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. భారత్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరింది. ప్రస్తుతం ఇండియాలో ప్రతిరోజు 2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయని, మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఇక్కడికి రాకపోవడం మంచిదని తెలిపింది. తప్పనిపరిస్థితిలో మాత్రమే భారత్‌కు ప్రయాణించాలని సూచించింది.  

Updated Date - 2021-04-18T13:03:15+05:30 IST