Corona Vaccine తీసుకోను.. నా ఇష్టం.. అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన అమెరికా నర్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-08-27T09:49:28+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ను నిరాకరించినందుకు ఓ నర్సుపై వేటు పడింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టిం

Corona Vaccine తీసుకోను.. నా ఇష్టం.. అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన అమెరికా నర్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ను నిరాకరించినందుకు ఓ నర్సుపై వేటు పడింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై ఈ వైరస్ పంజా విసిరింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమెరికాలో సంభవించినన్ని మరణాలు, కేసులు ఇతర ఏ దేశంలో కూడా నమోదు కాలేదు. మహమ్మారి ధాటికి అల్లాడిపోయిన అగ్రరాజ్యం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకుంది. యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొదటగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో ఒహియో రాష్ట్రానికి చెందిన మెలిస్సా రెక్ర్సోత్ అనే నర్సు.. వ్యాక్సినేషన్‌పై స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. ఫేస్‌బుక్ వేదికగా తాను వ్యాక్సిన్ తీసుకోనని ప్రకటించింది. అదే ఆమెకు శాపంగా మారింది. ఈ పోస్ట్‌పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. డిసెంబర్ 1న ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. 



కాగా.. ఈమె మంగళవారం రోజు ఒహియో స్టేట్‌హౌస్ వద్ద నిరసనల్లో పాల్గొని తన గళాన్ని వినిపించారు. వ్యాక్సిన్ తప్పనిసరి ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ ఓ బిల్లును రూపొందించి దాన్ని పాస్ చేయాలంటూ వేలాది మందితో కలిసి ఆమె డిమాండ్ చేశారు. అంతకు ముందు ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టిన మరోపోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎటువంటి పరికరాలు అందుబాటులో లేని సమయంలోనే తాను ధైర్యంగా కొవిడ్ బాధితులకు సేవలు చేశానని తెలిపారు. తన కళ్ల ముందు చికిత్స తీసుకున్న చాలా మంది కొవిడ్ బాధితులు క్షేమంగా ఇంటికి వెళ్లినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను వ్యాక్సిన్ వద్దు అనడానికి చాలా కారణాలు ఉన్నట్టు మెలిస్సా రెక్ర్సోత్ వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవడం, తీసుకోకపోవడం వ్యక్తి యెక్క ఇష్టంపై ఆధారపడి ఉండాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలను బలవంతపెట్టొద్దని సూచించారు. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలని సూచిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో స్పందిస్తున్న నెటిజన్లు ఆమె సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. కాగా.. మూడు రోజుల్లోనే ఆమె పెట్టిన పోస్టుకు 4.41లక్షల షేర్లు, 2లక్షల కామెంట్లు లభించాయి. 


Updated Date - 2021-08-27T09:49:28+05:30 IST