బెంగాల్‌లో తెలుగుకు అధికార భాష హోదా

ABN , First Publish Date - 2020-12-23T08:50:50+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో తెలుగుకు అధికార భాష హోదా ఇస్తూ మమతా బెనర్జీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

బెంగాల్‌లో తెలుగుకు అధికార భాష హోదా

భాషాపరమైన మైనారిటీలుగా తెలుగువారికి 

గుర్తింపు.. మమత కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కోల్‌కతా, డిసెంబరు 22: పశ్చిమ బెంగాల్‌లో తెలుగుకు అధికార భాష హోదా ఇస్తూ మమతా బెనర్జీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. తెలుగువారిని తమ రాష్ట్రం లో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించింది. ‘మినీ ఆంధ్రా’గా పేరొందిన ఖరగ్‌పూర్‌లోని తెలుగువారిని ఆకర్షించి, వారి ఓట్లను పొందేందుకే దీదీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషి స్తున్నారు. ఖరగ్‌పూర్‌ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరింట తెలుగువాళ్లే కౌన్సిలర్లు. వివిధ పార్టీల్లో మనవాళ్లు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని అక్కడి ప్రజలు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు. బెంగాల్‌లో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఉంది.

Updated Date - 2020-12-23T08:50:50+05:30 IST