Abn logo

ఓట్స్‌ చాట్‌

కావలసినవి :

ఓట్స్‌ - పావు కప్పు, పెరుగు - మూడు టేబుల్‌స్పూన్లు, దానిమ్మగింజలు - ఒక టేబుల్‌స్పూన్‌, చాట్‌ మసాలా - పావు టీస్పూన్‌, జీలకర్రపొడి - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - కొద్దిగా, గ్రీన్‌చట్నీ - టీస్పూన్‌, స్వీట్‌చట్నీ - టీస్పూన్‌, కారప్పూస - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ :

స్టవ్‌పై పాన్‌ పెట్టి ఓట్స్‌ను చిన్నమంటపై వేగించాలి. ఒక పాత్రలో పెరుగు, చాట్‌ మసాలా, జీలకర్రపొడి వేసి కలపాలి. స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ వేసి కలియబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేగించిన ఓట్స్‌లో వేసి కలపాలి. నిమ్మ గింజలు, కొత్తిమీర, కారప్పూసతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

పెరుగు పకోడీదహీ అంజీర్‌ కబాబ్‌పెరుగు బ్రెడ్‌ దహీ రోటీపెరుగు వడతోటకూర చెక్కలు (వీడియో)చిట్టి బుడగలుబీట్‌రూట్ కట్‌లెట్వెజ్‌ పిజ్జాసగ్గుబియ్యం గ్రీన్ కిచిడి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement