జి.కొండూరు తహసీల్దార్, వీఆర్వోను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2022-06-16T16:10:42+05:30 IST

జిల్లాలోని గడ్డమణుగు గ్రామంలో ఎమ్మార్వోను రైతులు అడ్డుకున్నారు.

జి.కొండూరు తహసీల్దార్, వీఆర్వోను అడ్డుకున్న రైతులు

ఎన్టీఆర్‌: జిల్లాలోని గడ్డమణుగు గ్రామంలో ఎమ్మార్వోను రైతులు అడ్డుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో  జి.కొండూరు తహసీల్దార్ ఇంతియాజ్ భాషా, గ్రామ వీఆర్వో బలవంతంగా దారి ఏర్పాటు చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకొన్న రైతులు అక్కడకు చేరుకుని తహసీల్దార్, వీఆర్వోలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అధికారులు తమపై దాడి చేసారని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ దాడి చేసిన వీడియోలు కోర్టుకు సమర్పిస్తామని రైతులు తెలిపారు. 

Updated Date - 2022-06-16T16:10:42+05:30 IST