సీనియర్ ప్రభుత్వోద్యోగి మరణం.. ఆత్మహత్య కావొచ్చంటున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-07-16T21:50:11+05:30 IST

సతీష్ కొంత కాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్నాడని, అతడు పని చేయడానికి ఇష్టపడటం లేదని ఆయన భార్య పోలీసులకు తెలిపారు. మృతుడు సతీష్ వారణాసికి చెందిన వ్యక్తని, అతడికి ఇద్దరు కూతుళ్లని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఉద్యోగానికని ఇంటి నుంచి వెళ్లిన సతీష్..

సీనియర్ ప్రభుత్వోద్యోగి మరణం.. ఆత్మహత్య కావొచ్చంటున్న పోలీసులు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఉన్న ఎన్టీపీసీలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఒక ఉద్యోగి హఠాన్మరణానికి గురయ్యారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ డీజీఎం సతీష్ కుమార్ సింగ్.. ఎన్టీపీసీ క్యాంపస్‌లోని కూలింగ్ ప్లాంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. శుక్రవారం రాత్రి కూలింగ్ ప్లాంట్ నుంచి సతీష్ మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి పంపించామని ఆయన పేర్కొన్నారు.


సతీష్ కొంత కాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్నాడని, అతడు పని చేయడానికి ఇష్టపడటం లేదని ఆయన భార్య పోలీసులకు తెలిపారు. మృతుడు సతీష్ వారణాసికి చెందిన వ్యక్తని, అతడికి ఇద్దరు కూతుళ్లని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఉద్యోగానికని ఇంటి నుంచి వెళ్లిన సతీష్.. సాయంత్రం ఆలస్యమైనా ఇంటికి తిరిగి రాకపోయే సరికి ఆయన భార్య పోలీసుల్ని ఆశ్రియించిందని, అనంతరం పోలీసులు ఎన్టీపీసీకి వెళ్లి తనిఖీ చేయగా కూలింగ్ ప్లాంట్‌లో అతడు మృతుడిగా కనిపించాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-07-16T21:50:11+05:30 IST