హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బాలా త్రిపురసుందరి అనే ఎన్ఆర్ఐ బీజేపీలో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన బాలత్రిపుర సుందరి పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ చేస్తోన్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరుతున్నట్లు బాలాత్రిపుర సుందరి తెలిపారు.