‘నామినేటెడ్‌’ మాయ!

ABN , First Publish Date - 2021-07-18T08:18:46+05:30 IST

రాష్ట్రంలో పదవుల పందేరం పేరిట వైసీపీ సర్కారు హైడ్రామాకు తెరతీసింది. ఒకేసారి, ఎంతో భారీగా ఎన్నెన్నో పదవులు ఇచ్చామంటూ హడావుడి చేసింది. కాస్త లోపలకు వెళ్లి చూస్తే ముఖ్యమైన పోస్టులను ‘ఒకే’ సామాజికవర్గంతో నింపేసి..

‘నామినేటెడ్‌’ మాయ!

పదవుల పందేరంలో గిమ్మిక్కులు

అబ్రకదబ్ర అకాడమీలు.. తోచిన పేర్లతో తెరపైకి ఎన్నో కార్పొరేషన్లు

సంఖ్య కోసం సృష్టించినవే అధికం

ఒక్క ‘సాంస్కృతికా’నికే ఐదారు అకాడమీలు

చరిత్రలోనే కనిపించని హిస్టరీ అకాడమీ

ఆర్టీసీలో ఒకే రీజినల్‌కు రెండు పదవులు

పైగా అవన్నీ ‘రాష్ట్ర’ స్థాయి పదవులట!

‘స్మార్ట్‌’ కాని రాజమహేంద్రికి ఆ హోదాతో చైర్మన్‌

పరిధి దాటి మూడు స్మార్ట్‌సిటీలకు చైర్మన్లు

137 పేర్లతో జాబితా ప్రకటించిన సర్కారు

ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి

ఆప్కాబ్‌కు ఝాన్సీరాణి, మార్క్‌ఫెడ్‌కు నాగిరెడ్డి


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో పదవుల పందేరం పేరిట వైసీపీ సర్కారు హైడ్రామాకు తెరతీసింది. ఒకేసారి, ఎంతో భారీగా ఎన్నెన్నో పదవులు ఇచ్చామంటూ హడావుడి చేసింది. కాస్త లోపలకు వెళ్లి చూస్తే  ముఖ్యమైన పోస్టులను ‘ఒకే’ సామాజికవర్గంతో నింపేసి.. ఎక్కడా ఉనికిలో లేని, చెల్లుబాటుకాని పోస్టులు మాత్రం బడుగు, బలహీనవర్గాలకు కేటాయించారు. నామినేటెడ్‌ పదవులకు మొత్తం 137  పేర్లతో శనివారం రాష్ట్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. కనీవినీ ఎరుగని స్థాయిలో కార్పొరేషన్లు, అకాడమీలకు చైర్మన్‌ పదవులు ఇచ్చామని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేశామని చెప్పుకొన్నారు. కానీ, తరచి చూస్తే.. ‘ఒక వైపే’  చూసి తయారుచేసినట్టు జాబితాను పరిశీలించినవారు వ్యాఖ్యానిస్తున్నారు. హైకోర్టు జిల్లా గ్రంథాలయ సంస్థలను కొనసాగించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పినా.. కొత్తగా చైర్మన్లను ప్రకటించారు. ఇవి ఎలాగూ చెల్లవు. అలాగే, స్మార్ట్‌ సిటీల పేరిట మరికొన్ని పదవులు సృష్టించారు. కేంద్ర నియమావళి ప్రకారం అవీ చెల్లుబాటుకానివే. ఇక కార్పొరేషన్లను పరిశీలిస్తే ఒక్క సమావేశం జరపాల్సిన అవసరం కూడా లేని కార్పొరేషన్లు, అకాడమీలే ఎక్కువ. తోసిన పేరు పెట్టి తెరపైకి తెచ్చిన సంస్థలెన్నెన్నో! అనాలోచితంగా కేవలం సంఖ్య కోసం నిలవడనివీ, చైర్మన్లు నిలబడటానికి కూడా చోటు లేని వాటినెన్నింటినో ప్రకటించారు. ‘సాంస్కృతిక అకాడమీ’కి పట్టిన గతే ఇందుకు నిదర్శనం! ‘తెలుగు-సంస్కృత’ అకాడమీని ప్రకటించినప్పుడు.. అందులో ‘తెలుగు’ ఉన్నప్పుడు ఈ యాగీ ఎందుకని వాదించినవారు కూడా ఉన్నారు. తాజాగా ‘సాంస్కృతిక అకాడమీ’ని ఎన్నెన్నో అకాడమీలుగా మార్చిన తీరుచూసి అలాంటివారు సైతం విస్తుపోతున్నారు. సాహిత్యానికి వేరుగా, సంగీతనృత్యానికి వేరుగా, జానపద, సృజనాత్మకతలకు వేరుగా, నాటకాలకు వేరుగా అకాడమీలను సృష్టించేశారు. గొప్పగా ఇచ్చామని చెప్పుకోవడానికి ఆర్టీసీ రీజినల్‌ బోర్డు పదవులనూ ‘రాష్ట్రస్థాయి’లో చూపించుకొన్నారు. మళ్లీ అందులో ఒకే రీజియన్‌లో రెండు పదవులు పంచేశారు. ఇలా ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు! జాబితా ‘భారీ’గా కనిపించాలని పడరాని పాట్లు! దానికోసం నోటికొచ్చిన పేర్లతో కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని మేధావులు సైతం నివ్వెరపోతున్నారు.


‘సిటీ’ లేకుండానే కార్పొరేషనా..?

మనుగడలో ఉన్న కార్పొరేషన్లకు బోర్డు సభ్యులను నియమించడం రివాజు. కానీ, వైసీపీ సర్కారు కొత్త పుంతలు తొక్కింది. రాజమండ్రి అసలు స్మార్ట్‌సిటీగా ఎంపిక కాలేదు. విశాఖ, కాకినాడ, తిరుపతిని కేంద్రం స్మార్ట్‌సిటీలు జాబితాలో పెట్టింది. కానీ, రాజమండ్రికి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయడమేకాదు.. చైర్మన్‌ని కూడా నియమించేసింది. స్మార్ట్‌ సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఒక కాన్సెప్ట్‌. కొన్ని నగరాలను ఎంపిక చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెరుగైన వసతులతో స్మార్ట్‌ స్థాయికి తీర్చిదిద్దడం దాని లక్ష్యం. రాష్ట్రంలో ఓ వైపు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీలున్నాయి. మరో పక్క ఎన్నికైన పట్టణ స్థానికసంస్థలున్నాయి. స్మార్ట్‌సిటీకి నియమించిన చైర్మన్‌ ఏం చేస్తారో దానిని సృష్టించిన మేధావులకే తెలియాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


చిన్న ఊరు.. కార్పొరేషన్‌..

ఏలేశ్వరం అనేది ఒక చిన్న ఊరు. దానికి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి చైర్మన్‌ను నియమించడంపై అంతా విస్తుపోయారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్‌ ఏర్పాటుచేసింది. దానికి ఉన్నతాధికారులను నియమించింది. సీఎంవో పర్యవేక్షణలో దాని నిర్వహణ చేపట్టారు. అయితే, దా నికి కూడా చైర్మన్‌ను నియమించి ఆశ్చర్యపరిచారు. రాజమండ్రిలోని హితకారిణి సమాజం చైర్మన్‌ పదవి ని గతంలో స్థానికంగా ఉన్న వారికి ఇచ్చేవారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయాలను ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన సమాజమిది. ఆ సమాజం చైర్మన్‌ పోస్టు ఇప్పుడు ముమ్మడవరం వ్యక్తికి ఇచ్చా రు. ఈస్ట్‌ డెల్టా కార్పొరేషన్‌, వెస్ట్‌ డెల్టా కార్పొరేషన్‌, సెంట్రల్‌ డెల్టా కార్పొరేషన్‌ అంటూ కాగితాలకే పరిమితమైన పలు కార్పొరేషన్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. వాటన్నింటికీ చైర్మన్లను నియమించా రు. ఇప్పటి వరకు వినని సోషల్‌ జస్టిస్‌ సలహాదారు పోస్టును సృష్టించి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌కు అప్పగించారు. ఎప్పు డూ వినని హిస్టరీ అకాడమీని ఏర్పాటుచేసి ‘చరిత్ర’ సృష్టించారు. 


పాత ‘కార్పొరేషన్ల’ కథేనా..

ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్‌ పోస్టు లు భర్తీ చేశామని ఆర్భాటాలు చేస్తున్నా.. వాటికి సిబ్బంది, కార్యాలయాలు, చైర్మన్లకు జీతాలు, అలవెన్సులు సమకూర్చాలి. ఇప్పటికే 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి న ప్రభుత్వం వాటికి కార్యాలయా లు ఏర్పాటుచేయడానికి ఏడాది పట్టింది. బడ్జెట్‌ కాగితాల్లో మాత్రమే నిధులు ప్రకటించి, చైర్మన్ల పాలనలో పైసా ఖర్చు పెట్టలేని దీనస్థితిలో బీసీ కార్పొరేషన్లు ఉన్నాయని చెప్తున్నారు.   నెలనెలా జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు రిజర్వు బ్యాంకు తలుపు తడుతున్న ప్రభుత్వం అవసరం లేని.. మనుగడలో లేని కార్పొరేషన్ల ఏర్పాటుతో రాష్ట్రంపై మరింత ఆర్థిక భారం వేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. 


ఆర్టీసీలో అయోమయం

ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు ఎ.మల్లికార్జున రెడ్డిని (కడప) నియమించారు. రీజినల్‌ బోర్డు సభ్యులుగా గదల బంగారమ్మ(విజయనగరం), తాతినేని పద్మావతి(కృష్ణా), బత్తుల సుప్రజ(ప్రకాశం), మాల్యవంతం మంజుల(అనంతపు రం), ఎంసీ విజయానందరెడ్డి(చిత్తూరు)లను నియమించారు. ఆర్టీసీకి రాష్ట్రంలో 12 రీజియ న్లు, 4 జోన్లు(విజయనగరం, విజయవాడ, నె ల్లూరు, కడప) ఉన్నాయి. నెల్లూరు, కడప జో న్‌లలో ఇద్దరికి చొప్పున పదవులు కట్టబెట్టారు. కడప జోన్‌లో ఒకరు చైర్మన్‌ కాగా, మరొకరు(మంజుల) రీజినల్‌ బోర్డు సభ్యురాలు కావడం తో ఇబ్బందిలేదు. నెల్లూరు జోన్‌లో ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఇద్దరిని నియమించడంతో ఎవరికి ఎంత పరిధి ఉందో అధికారుల కు తెలియడంలేదు. ఏవైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే, ఏవిధంగా ప్రొటోకాల్‌ కల్పించా లో కూడా తెలియని పరిస్థితి. పోనీ రీజియన్‌ ప్రకారం తీసుకుందామంటే విశాఖ, ఉభయ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడపలకు చోటు కల్పించలేదు. ఈ విషయమై ప్రభుత్వానికి లేఖ రాసి, నిర్ణయం తీసుకుంటామని అధికార వర్గాలు తెలిపాయి. 


జిల్లా ఓసీ బీసీ, ఎస్సీ, మొత్తం పురుషులు  మహిళలు  ఎస్టీ, మైనారిటీ

శ్రీకాకుళం 1 6 7 3 4

విజయనగరం 2 5 7 3 4

విశాఖపట్నం 5 5 10 5 5

తూర్పుగోదావరి 8 9 17 8 9

పశ్చిమగోదావరి 6 6 12 6 6

కృష్ణా 4 6 10 5 5

గుంటూరు 3 6 9 5 4

ప్రకాశం 5 5 10 5 5

నెల్లూరు 5 5 10 5 5

చిత్తూరు 5 7 12 6 6

అనంతపురం 5 5 10 5 5

కడప 5 6 11 6 5

కర్నూలు 5 5 10 5 5

మొత్తం 59 76 135 67 68


ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌గా ఝాన్సీరాణి

మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా నాగిరెడ్డి 


అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలను నియమించిన ప్రభు త్వం.. 13 డీసీసీబీలు, 13 డీసీఎంఎ్‌సలు, ఆపా ్కబ్‌, మార్క్‌ఫెడ్‌లకు చైర్మన్లను ఖరారు చేసింది. చైర్మన్‌ అభ్యర్థులను శనివారం ప్రకటించారు. ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌గా కడప ఎం. ఝాన్సీరాణి పేరును ఖరారు చేశారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన పీపీ నాగిరెడ్డిని ఎంపి క చేశారు.  వీటికి సంబంధించి సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. కాగా, గుంటూరు, ప్రకాశం, చిత్తూ రు డీసీసీబీ చైర్మన్లుగా ఇంతకుముందు ఆ పదవులు నిర్వహించిన వారినే తిరిగి ఎంపిక చేయ గా, నెల్లూరు, అనంతపురం డీసీఎంఎ్‌సల పాత చైర్మన్లను అవే పోస్టులకు ఎంపిక చేశారు. ప్రకా శం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఇంతకు ముందు పని చేసిన రావి రామనాథంబాబు భార్య పద్మావతిని ఈ సారి చైర్‌పర్సన్‌గా నియమించారు.


పేరు                                 నామినేటెడ్‌ పోస్టు

బల్లాడ హేమమాలినీ రెడ్డి         ఏపీ ఉమెన్స్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

సాది శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి                 సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ 

                                ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఏపీ (సీడ్యాప్‌)

నర్తు రామారావు                 ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌

కాయల వెంకటరెడ్డి             మారిటైమ్‌ బోర్డు

శోభా స్వాతిరాణి             చైర్మన్‌, జీసీసీ 

జమ్మాన ప్రసన్నకుమార్‌     ఏపీ టిడ్కో 

గదల బంగారమ్మ             ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు 

మళ్ల విజయప్రసాద్‌             ఏపీ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ 

                            ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

కేకే రాజు                     న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌

సటకా బుల్లిబాబు             చైర్మన్‌, ట్రైకార్‌

సీతంరాజు సుధాకర్‌             ఏపీ స్టేట్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బీ జాన్‌ వెస్లీ                     ఏపీస్టేట్‌ క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

దావులూరి దొరబాబు             ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌

కుడిపూడి సత్య శైలజ             దృశ్య కళలు అకాడమీ

టి.ప్రభావతి                     సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ

ద్వారంపూడి భాస్కరరెడ్డి     సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ 

బొంతు రాజేశ్వరరావు             సలహాదారు, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, రూరల్‌ వాటర్‌ సప్లై

వంక రవీంద్రనాథ్‌             ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

దయాల నవీన్‌బాబు             వైస్‌ చైర్‌, ఏపీ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు 

పాతపాటి సర్రాజు             ఏపీ క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బర్రి లీల                     ఏపీ స్టేట్‌ మినిమమ్‌ వేజెస్‌ అడ్వయిజరీ బోర్డు 

పిల్లంగోళ్ల్ల శ్రీలక్ష్మి             సాహిత్య అకాడమీ 

కనుమూరి సుబ్బరాజు     ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

అరుణ్‌ కుమార్‌ మొండితోక     ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

అడపా శేషగిరి                     ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

షేక్‌ అసిఫ్‌                     ఏపీ స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశీల    ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

తాతినేని పద్మావతి             ఎపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు

తుమ్మల చంద్రశేఖర్‌రావు     ఏపీ కమ్మ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

గుబ్బ చంద్రశేఖర్‌             ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ఆరిమండ వరప్రసాదరెడ్డి     ఏపీ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ముంతాజ్‌ పఠాన్‌             ఏపీ స్టేట్‌ హ్యాండీకాప్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ కార్పొరేషన్‌

షేక్‌ ఆశా బేగం షేక్‌                 కార్పొరేషన్‌

కుర్రా నాగమల్లీశ్వరి             హిస్టరీ అకాడమీ

మందపాటి శేషగిరిరావు     ఏపీ గ్రంథాలయ పరిషత్‌

కాకుమాని రాజశేఖర్‌             లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బత్తుల సుప్రజ                     ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు 

బాచిన కృష్ణ చైతన్య             సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌వర్క్‌

సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి     ఏపీ రెడ్డి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

షేక్‌ సుభాన్‌బీ                     ఏపీ స్టేట్‌ టైలర్స్‌ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌

జూపూడి ప్రభాకరరావు             అడ్వయిజర్‌ సోషల్‌ జస్టిస్‌

పేర్నాటి సుస్మిత             ఏపీ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

పొణకా దేవసేన             స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌

మేరుగు మురళీధర్‌             ఏసీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

పొట్టేళ్ల శిరీష యాదవ్‌             సంగీత నృత్య అకాడమీ

షేక్‌ సైదానీ                     ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌

మెట్టుకూరు చిరంజీవి రెడ్డి     ఏపీ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌

షమీమ్‌ అస్లాం                     ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ఎంసీ విజయానందరెడ్డి             ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు

రెడ్డివారి చక్రపాణి రెడ్డి             శ్రీశైలం చైర్మన్‌

ఖాదర్‌ బాషా                     వక్ఫ్‌ బోర్డు 

కొండవేటి నాగ భూషణం     ఫోక్‌ అండ్‌ క్రియెటివిటీ అకాడమీ

బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్‌     ఏపీ స్టేట్‌ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

మాల్యవంతం మంజుల             ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు

నదీమ్‌ అహ్మద్‌             ఏపీ స్టేట్‌ ఉర్దూ అకాడమీ

మెట్టు గోవిందరెడ్డి             ఏపీఐఐసీ

వై హరిత                     నాటక అకాడమీ 

కరీముల్లా షేక్‌ అమీన్‌             ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌

మల్లెల ఝాన్సీ రెడ్డి             ఆప్కాబ్‌

బడిగించల విజయలక్ష్మి     ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ఏ మల్లిఖార్జున రెడ్డి             ఏపీఎస్‌ఆర్టీసీ 

పులి సునీల్‌ కుమార్‌             ఏపీ స్టేట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు 

కోడూరు అజయ్‌ర రెడ్డి     ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బద్వేల్‌ షేక్‌ గౌస్‌ లాజం     ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ 

వెంపలాకు లీలావతి             ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బైరెడ్డి సిద్దార్థ రెడ్డ్డి             స్పోర్ట్స్‌ అథారిటీ

పర్లప్పగారి భాగ్యమ్మ             ఏపీ ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు 

పామిరెడ్డి పెద్దనాగిరెడ్డి             ఏపీ మార్క్‌ఫెడ్‌

కర్రా గిరిజ                     ఏపీ స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

మాదిగ శ్రీరాములు             ఏపీ మీట్‌ కార్పొరేషన్‌

షేక్‌ గౌసియా బేగం             ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌

సువ్వారి సువర్ణ             శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ 

కోరాడ ఆశాలత             శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 

చల్లా సుగుణ                     డీసీఎంఎస్‌, శ్రీకాకుళం

కరిమి రాజేశ్వరరావు             డీసీసీబీ, శ్రీకాకుళం

రెడ్డి పద్మావతి                     విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ 

ఇంటి పార్వతి                     విజయనగరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

అవనాపు భావన             డీసీఎంఎస్‌, విజయనగరం

నెక్కల నాయుడు బాబు     డీసీసీబీ, విజయనగరం

చొక్కాకుల లక్ష్మి             విశాఖ-కాకినాడ పెట్రోలియం, పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌

అక్రమాని విజయనిర్మల     విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అథారిటీ

గన్నమని వెంకటేశ్వరరావు     గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

కొండ రమాదేవి             విశాఖ జిల్లా గ్రంఽథాలయ సంస్థ 

పల్లా చిన్నతల్లి                     డీసీఎంఎస్‌, విశాఖపట్నం

సీహెచ్‌ అనిత                     డీసీసీబీ, విశాఖపట్నం

మేడపాటి షర్మిలా రెడ్డి     రుడా 

చందన నగేశ్‌                     రాజమండ్రి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

అల్లి రాజబాబు యాదవ్‌     కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

కాశి మునికుమారి             హితకారిణి సమాజం 

టి శైలజా పార్వతి             ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు

దూలం పద్మ                     తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ

రాగిరెడ్డి దీప్తి కుమార్‌             కుడా

సాకా మణికుమారి             డీసీఎంస్‌, తూర్పు గోదావరి

గిరిజాల రామకృష్ణ తులసి     రాజమండ్రి అర్బన్‌ బ్యాంకు

ఏడిద చక్రపాణిరావు             ఈస్ట్రన్‌ డెల్టా బోర్డు 

ఆకుల వీర్రాజు                     డీసీసీబీ, తూర్పు గోదావరి

కుడిపూడి వెంకటేశ్వరరావు     సెంట్రల్‌ డెల్టా బోర్డు 

మధ్యనాపు ఈశ్వరి             ఈయూడీఏ

చీర్ల పద్మశ్రీ                     పశ్చిమ గోదావరి జిల్లా గ్రంఽథాలయ సంస్థ 

గంజిమల దేవి                     వెస్ట్రన్‌ డెల్టా బోర్డు 

వెండ్ర వెంకటస్వామి             డీసీఎంఎస్‌, పశ్చిమ గోదావరి

బొద్దాని అఖిల                     ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

పీవీఎల్‌ నరసింహరాజు     డీసీసీబీ, పశ్చిమ గోదావరి

టి.జమల పూర్ణమ్మ             కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ 

పటమట స్నిగఽ్ధ             డీసీఎంఎస్‌, కృష్ణా

బీవీ దుర్గానాగలక్ష్మి             మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

తన్నీరు నాగేశ్వరరావు             డీసీసీబీ, కృష్ణా

బాతుల దేవానంద్‌             గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 

వై భాగ్యలక్ష్మి                     డీసీఎంస్‌, గుంటూరు

ఆర్‌.సీతారామాంజనేయులు డీసీసీబీ, గుంటూరు 

సింగరాజు మీనాకుమారి ఓయూడీఏ

రాచగొర్ల వెంకట సుశీల ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ

రావి పద్మావతి డీసీఎంఎస్‌, ప్రకాశం

మదాసు వెంకయ్య డీసీసీబీ, ప్రకాశం

ముక్కాల ద్వారకానాథ్‌ నూడా 

దొంతు శారద నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 

కామిరెడ్డి సత్యనారాయణ డీసీసీబీ, నెల్లూరు

వీరి చలపతి డీసీఎంఎస్‌, నెల్లూరు

నరమల్లి పద్మజ తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

బి వీరేంద్ర వర్మ శ్రీకాళహస్తి టెంపుల్‌

ప్రమీలమ్మ రెడ్డి కాణిపాకం దేవాలయం 

సామకోటి నాగలక్ష్మి డీసీఎంఎస్‌, చిత్తూరు

ఎం రెడ్డమ్మ డీసీసీబీ, చిత్తూరు

నయనార్‌ మధుబాల చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 

వెంకటరెడ్డి యాదవ్‌ పలమనేరు కుప్పం మదనపల్లె 

అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

మహాలక్ష్మి శ్రీనివాసులు ఏ-హుడా

లోమడ ఉమాదేవి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ 

మానుకింద లిఖిత డీసీసీబీ, అనంతపురం 

తాడిమర్రి చంద్రశేఖర రెడ్డి డీసీఎంఎస్‌, అనంతపురం

లక్ష్మీనరసమ్మ పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

ఎల్‌ ఉషారాణి కడప జిల్లా గ్రంథాలయ సంస్థ 

శింగసాని గురుమోహన్‌ అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 

దండు చంద్రలీల డీసీఎంఎస్‌, కడప

కోట్ల హర్షవర్థన్‌రెడ్డి కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

సన్నాల మహాలక్ష్మి డీసీసీబీ, కర్నూలు

ఎం.సుభాష్‌ చంద్రబోస్‌ కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ 

చంచన్నగారి శిరోమణి డీసీఎంఎస్‌, కర్నూలు

Updated Date - 2021-07-18T08:18:46+05:30 IST