రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ‘ఆకాశ్ ఎయిర్’కు ఎన్‌ఓసీ

ABN , First Publish Date - 2021-08-06T00:20:45+05:30 IST

పౌరవిమానయాన రంగంలోకి అడుగుపెడుతున్న ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’... రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా... ‘ఆకాశ్ ఎయిర్‌’ పేరుతో సామాన్యులు సైతం ప్రయాణించగలిగేలా చౌక ధరతో కూడుకున్న ఛార్జీలతో ఓ విమానయాన సంస్థను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే.

రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ‘ఆకాశ్ ఎయిర్’కు ఎన్‌ఓసీ

న్యూఢిల్లీ / బెంగళూరు / ముంబై : పౌరవిమానయాన రంగంలోకి అడుగుపెడుతున్న ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’... రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా... ‘ఆకాశ్ ఎయిర్‌’ పేరుతో సామాన్యులు సైతం ప్రయాణించగలిగేలా చౌక ధరతో కూడుకున్న ఛార్జీలతో ఓ విమానయాన సంస్థను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన... తాజాగా ఓ అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. డీజీసీఏ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ జారీ అయినట్లు తెలుస్తోంది.


ఈ క్రమంో... ఈ ఏడాది చివరి నాటికే సంస్థ విమానాలు ఆకాశంలో ఎగరనున్నట్లు విననవస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ కోసం ముందుగా కొన్ని విమానాలను తీసుకోబోతోంది.  సంస్థలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 35 మిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టనున్నారు. అంటే,,, ఇది 40 శాతం వాటాతో సమానం మిగిలిన వాటాను ఎయిర్‌బీఎన్‌బీ, పార్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌లు తీసుకోనున్నాయి. తొలి దశలో 70 విమానాలను కొనబోతున్నారు. సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబే వ్యవహరించనున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ అయ్యర్‌ సీఓఓగా ఉండబోతున్నారు. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది.  

Updated Date - 2021-08-06T00:20:45+05:30 IST