మత్స్యకారులకు డీజిల్‌పై అమ్మకం పన్ను తీసేస్తామనలేదు

ABN , First Publish Date - 2021-11-24T08:44:40+05:30 IST

మత్స్యకారులకు డీజిల్‌పై అమ్మకం పన్ను తీసేస్తామనలేదు

మత్స్యకారులకు డీజిల్‌పై అమ్మకం పన్ను తీసేస్తామనలేదు

మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్‌

అసెంబ్లీలో మంత్రి సీదిరి అప్పలరాజు

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మత్స్యకా రులకు ఇచ్చే డీజిల్‌పై అమ్మకం పన్ను తీసేస్తామని హామీ ఇవ్వలేదని పశుసంవర్దక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. మత్స్యకార భరోసా కింద వేట నిషేధ సమయంలో ఏడాదికి రెండు నెలలు రూ.10 వేల చొప్పున ఇస్తున్నామని.. 18-21 ఏళ్ల మధ్య ఉన్న మత్స్యకారులకు ఇవ్వడం లేదని మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. ఆ వయసులో ఉన్నవారు డిగ్రీ చదువుకోవాలని, వారంతా చదువుకుంటే వసతి దీవెన, విద్యాదీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మత్స్యకారుల ఇబ్బం దులను లేవనెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు డీజిల్‌పై ఇచ్చే సబ్సిడీని లీటరుకు రూ.6 నుంచి రూ.9కు పెంచినా.. డీజిల్‌ ధర రూ.65 నుంచి రూ.100కి పెరగడం వల్ల భారంగా  మారిం దన్నారు. ఈ దృష్ట్యా డీజిల్‌పై అమ్మకం పన్ను లేకుం డా చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆ పనిచేయాలన్నారు. మత్స్యకార భరోసా కిం ద వేట నిషేధ సమయంలో ఇచ్చే లబ్ధిని.. ఇతర పథ కాల ప్రయోజనం పొందేవారికి ఇవ్వడం లేదన్నారు. 

Updated Date - 2021-11-24T08:44:40+05:30 IST