హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయం గా ఉక్కు ధరలు తగ్గిన ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఎన్‌ఎండీసీ నికర లాభం 54% క్షీణించింది. గత ఏడాది జూన్ త్రైమాసి కంలో రూ.3,193 కోట్ల లాభాన్ని ప్రకటించగా.. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో రూ.1,469 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఇతర, వడ్డీ ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం కూడా 26 శాతం క్షీణించి రూ.6,656 కోట్ల నుంచి రూ.4,913 కోట్లకు చేరింది.