పోలవరంపై తేల్చేసిన నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2020-10-24T01:01:38+05:30 IST

పోలవరంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. పోలవరానికి రావాల్సింది రూ.15,667.90 కోట్లు మాత్రమేనని నిర్మల చెప్పారు. రూ.8,614.16 కోట్లు ఇప్పటికే మంజూరు చేశామని

పోలవరంపై తేల్చేసిన నిర్మలా సీతారామన్

ఢిల్లీ: పోలవరంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. పోలవరానికి రావాల్సింది రూ.15,667.90 కోట్లు మాత్రమేనని నిర్మల చెప్పారు. రూ.8,614.16 కోట్లు ఇప్పటికే మంజూరు చేశామని కేంద్రం చెబుతోంది. ఇంకా ఇవ్వాల్సింది కేవలం రూ.7,053.74 కోట్లేనని కేంద్రం అంటోంది. గతంలో రూ.56 వేల కోట్లకుపైగా అంచనాలను టీడీపీ కేంద్రానికి పంపింది. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పోలవరంపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి వైసీపీ లేఖలు రాసింది. వైసీపీ రాసిన లేఖలే పోలవరానికి శాపంగా మారాయని అధికారులు అంటుంన్నారు. 2013, 2014 అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయాన్ని.. రూ.15,667.90 కోట్లకు కేంద్రం కుదించింది. కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,053.74 కోట్లే అని అంగీకరిస్తేనే.. ప్రసుత్తం రూ.2,234.28 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం షరతుపెట్టింది. నిర్మలతో సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పోలవరంపై హామీ దక్కలేదు.


‘‘పోలవరం సాగునీటి ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు ఏటీఎంగా మారింది. అందుకే.. 2013- 14లో రూ.29,027.95 కోట్లుగా ఉన్న అంచనాలను రూ.55,548.87 కోట్లుకు పెంచేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయాన్ని ఆకాశానికి ఎగబాకించారు. ప్రాజెక్టు అంతా అవినీతిమయం’’ అని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక.. ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరిట కాంట్రాక్టు సంస్థను మార్చేశారు. ఇప్పుడు... కేంద్రం కాలాన్ని కూడా రివర్స్‌ చేసి, 2013-14 అంచనాలే ఫైనల్‌ అని తేల్చేసింది. నిజానికి... యూపీఏ సర్కారు పోతూ పోతూ చేసిన కొత్త భూసేకరణ చట్టంతో పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాస వ్యయం భారీగా పెరిగాయి.

Updated Date - 2020-10-24T01:01:38+05:30 IST