Abn logo
Aug 13 2021 @ 15:44PM

నిర్మల్: కిసాన్ ఫ్యాషన్ మాల్‌ యాజమాన్యంపై కేసు

నిర్మల్: కిసాన్ షాపింగ్ మాల్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. సినీనటి అనుపమ పరమేశ్వరన్ షోరూంను ప్రారంభించారు. ఆమెను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పైగా జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. పోలీసుల అనుమతి లేకుండా బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి లేదు. ఆంక్షలు అమలులో ఉన్నా.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. షాపింగ్ మాల్ ఓనర్‌తోపాటు మేనేజర్‌పై పోలీస్ 30 యాక్ట్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవానికి ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులను ఉత్సాహపరిచారు.