న్యూట్రిషన్ సైన్స్, పాలసీకి ఎన్.ఐ.ఎన్ సహకారం అందించింది- డా. హేమలత

ABN , First Publish Date - 2021-10-27T20:02:20+05:30 IST

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్.ఐ.ఎన్) ఎల్లప్పుడూ అవసరం-ఆధారిత, ఆచరణాత్మక పరిశోధనలలో ముందంజలో ఉందని , పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో గొప్ప ఆచరణాత్మక విలువను కలిగి ఉందని ఎన్.ఐ.ఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత అన్నారు

న్యూట్రిషన్ సైన్స్, పాలసీకి ఎన్.ఐ.ఎన్ సహకారం అందించింది- డా. హేమలత

హైదరాబాద్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్.ఐ.ఎన్)  ఎల్లప్పుడూ అవసరం-ఆధారిత, ఆచరణాత్మక పరిశోధనలలో ముందంజలో ఉందని , పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో గొప్ప ఆచరణాత్మక విలువను కలిగి ఉందని ఎన్.ఐ.ఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత అన్నారు. ఎన్.ఐ.ఎన్ లో 2020 బ్యాచ్‌కు చెందిన భారత సమాచార సర్వీస్ (ఐ.ఐ.ఎస్) ఆఫీసర్ ట్రైనీల బృందంతో సంభాషించిన డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో అత్యంత పురాతనమైనదని,  పౌష్టికాహారం, ఆహార భద్రత, ప్రజారోగ్యం తో పాటు విధాన రంగాలలో తన పరిశోధనా కార్యకలాపాల ద్వారా విస్తృత రంగాలలో సహకరిస్తున్నట్లు తెలిపారు. 


ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐ.సి.డి.ఎస్), మధ్యాహ్న భోజన పథకం మొదలైన వివిధ జాతీయ పోషకాహార కార్యక్రమాల పోషక అవసరాలకు ఎన్.ఐ.ఎన్  దోహదపడిందని, సంస్థ ద్వారా నిర్వహించబడే కార్యక్రమాలు, కార్యకలాపాలను డైరెక్టర్ వివరించారు.ఈ సెషన్ లో భాగంగా ఐసిఎంఆర్-ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ జి.ఎం  సుబ్బారావు ఆఫీసర్ ట్రైనర్లతో ముచ్చటించారు. ఆరోగ్యం, పోషకాహార సంబంధిత కమ్యూనికేషన్ కు సంబంధించిన వివిధ అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేశారు. మీడియాను ఒక శక్తివంతమైన సాధనంగా పేర్కొంటూ, డాక్టర్ జి.ఎం  సుబ్బారావు అట్టడుగు స్థాయిలో ఆరోగ్య కమ్యూనికేషన్ కు సంబంధించిన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. మంచి కమ్యూనికేటర్లుగా ఎదగాలని,  సోషల్ మీడియాలో ముఖ్యంగా కోవిడ్ -19 సమయం లో ప్రసారం చేయబడిన తప్పుడు సమాచారాన్ని అరికట్టే విధంగా ఆలోచించాలని అధికారులకు సూచించారు. 


ఎన్ఐఎన్ పరిశోధన ఫలితాలైన అనేక శాస్త్రీయ, అర్థ శాస్త్రీయ, ప్రజాదరణ పొందిన ప్రచురణలను ప్రజలకు అందుబాటులో కి తెచ్చామని ఆయన అన్నారు.సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఆవుల లక్ష్మీయ్య, డాక్టర ఎమ్. మహేశ్వర్ ఎన్ఐఎన్ నిర్వహించిన వివిధ అధ్యయనాలు, పోషక సర్వేల గురించి అధికారులకు వివరించారు. ఈ సెషన్‌లో డాక్టర్ పి.మానస్ కృష్ణకాంత్, డిప్యూటీ డైరెక్టర్ పిఐబి, వర్గంటి గాయత్రి మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ పిఐబి సహా ఆఫీసర్ ట్రైనీలు ఆశిష్ గోయల్ సాయి వెంపటి, బాలనాగేంద్రన్. డి, అనురాగ్ కుమార్.కె పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T20:02:20+05:30 IST