నెక్స్ట్‌వేవ్‌కు రూ.21 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2021-12-02T06:19:18+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ నెక్స్ట్‌వేవ్‌ 28 లక్షల డాలర్ల (దాదా పు రూ.21 కోట్లు) నిధులు సమీకరించింది.....

నెక్స్ట్‌వేవ్‌కు రూ.21 కోట్ల నిధులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ నెక్స్ట్‌వేవ్‌ 28 లక్షల డాలర్ల (దాదా పు రూ.21 కోట్లు) నిధులు సమీకరించింది. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లు ఫండింగ్‌ రౌండ్‌ కింద ఈ నిధులు అందించినట్లు నెక్స్ట్‌వేవ్‌ సీఈఓ రాహుల్‌ తెలిపారు. ఓరియస్‌ వెంచర్‌, బెటర్‌ క్యాపిటల్‌, కార్‌ధేకోకు చెందిన ఉమంగ్‌ కుమార్‌ ఈ పెట్టుబడులు పెట్టారు. తాజాగా లభించిన నిధులను ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌, నియామకాలు, విస్తరణ కార్యక్రమాలకు వినియోగిస్తారు. నెక్స్ట్‌వేవ్‌ను శశాంక్‌ రెడ్డి గుజ్జుల, అనుపమ్‌ పెద్రాల, రాహుల్‌ అట్లూరి స్థాపించారు. స్థానిక భాషల్లో కాలేజీ విద్యార్థులు ఇతరులకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లను నెక్స్ట్‌వేవ్‌ నిర్వహిస్తోంది.  

Updated Date - 2021-12-02T06:19:18+05:30 IST