Abn logo
Feb 22 2020 @ 01:32AM

రిటైర్‌మెంట్‌ ఫండ్స్‌కు భలే గిరాకీ

  • రూ.10,425 కోట్లకు చేరిన పెట్టుబడులు


ముంబై: ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ పెట్టుబడుల స్వరూపం మారుతోంది. గతంలో ఎక్కువ మంది ఉద్యోగంలో ఉండగానే పదవీ విరమణ తర్వాత అవసరమయ్యే ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మదుపు చేసేవారు. ఇప్పుడు చాలామంది ఉద్యోగులు మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) అందించే రిటైర్‌మెంట్‌ ఫండ్స్‌లోనూ మదుపు చేస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం జనవరి నాటికి ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) రూ.10,425.3 కోట్లకు చేరింది.


 గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.8,376.2 కోట్లతో పోలిస్తే ఇది 24.5 శాతం ఎక్కువ. దేశంలోని ఎంఎ్‌ఫలకు ప్రాతినిధ్యం వహించే అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) ఒక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 


పెరుగుతున్న అవగాహన

గతంతో పోలిస్తే ఇన్వెస్టర్లలో రిటైర్‌మెంట్‌ పథకాలపై అవగాహన పెరిగింది. ఈ పథకాల్లో మదుపు చేసిన పెట్టుబడులను ఐదేళ్ల తర్వాత లేదా రిటైర్‌మెంట్‌ వయసులో వెనక్కి తీసుకోవచ్చు. దీర్ఘ కాలిక పెట్టుబడుల అవసరాలపై మదుపరుల్లో అవగాహన పెరగడం ఇందుకు ప్రధాన కారణమని యాంఫీ సీఈఓ ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు.


         

Advertisement
Advertisement
Advertisement