న్యూయార్క్‌లో కరోనా కల్లోలం.. హార్ట్ ద్వీపంలో మృతదేహాల ఖననం!

ABN , First Publish Date - 2020-04-11T03:38:10+05:30 IST

కరోనా వైరస్ అగ్రరాజ్యమైన అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అమెరికాలోని కేవలం ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 1.61లక్షల కరోనా కేసులు నమోదయ్యా

న్యూయార్క్‌లో కరోనా కల్లోలం.. హార్ట్ ద్వీపంలో మృతదేహాల ఖననం!

వాషింగ్టన్: కరోనా వైరస్ అగ్రరాజ్యమైన అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అమెరికాలోని కేవలం ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 1.61లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇన్ని కేసులు నమోదవ్వలేదు. అమెరికాలో కరోనాకాటుకు బలైన వారి సంఖ్య 17,910గా ఉంది. ఒక్క న్యూయార్క్‌లోనే దాదాపు 8వేల మంది మరణించారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో కరోనా మరణాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో అధికారులు మృతదేహాలను హార్ట్ ద్వీపంలో సమూహికంగా ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను నియమించి.. వారి చేత మృతదేహాలను ఖననం చేయిస్తున్నారు. హార్ట్ ద్వీపంలో మృతదేహాలను ఖననం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులోని దృశ్యాల ప్రకారం.. కొందమంది వ్యక్తులు మృతదేహాలను పేద్ద గొయ్యిలో ఉంచి.. ఆ గొయ్యిని మట్టితో నింపేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా లక్షమందికిపైగా మరణించారు. 

Updated Date - 2020-04-11T03:38:10+05:30 IST