ఏపీలో కరోనా బాధితుల డిశ్చార్జ్‌కు కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2020-07-07T16:23:46+05:30 IST

కరోనా బాధితుల డిశ్చార్జ్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఏపీలో కరోనా బాధితుల డిశ్చార్జ్‌కు కొత్త మార్గదర్శకాలు

అమరావతి: కరోనా బాధితుల డిశ్చార్జ్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కరోనా వైరస్ విలయానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,320 మందికి పాజిటీవ్‌గా తేలడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,019కి ఎకబాకింది. ఏపీలో ఒక్క రోజులోనే 13వందలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 


పరిస్థితి ఇలా ఉంటే కరోనా బాధితుల డిశ్చార్జ్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. కరోనా లక్షణాలు లేకుండా పాజిటీవ్ వచ్చినవారిని కోవిడ్ 19 ఆస్పత్రికి తరలిస్తారు. కరోనాకు సంబంధించి తక్కువ లక్షణాలు ఉన్నవారిని పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉంచుతారు. కరోనా సీరియస్ కేసుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. డిశ్చార్జ్ ముందు 3 రోజుల పాటు ఎలాంటి లక్షణాలు ఉండకపోతేనే ఇంటికి పంపిస్తారు.

Updated Date - 2020-07-07T16:23:46+05:30 IST