కొత్త ఆస్పత్రులకు కార్పొరేట్‌ హంగులు

ABN , First Publish Date - 2020-10-01T08:23:31+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సీఎం జగన్‌ ఆదేశించారు. వీటిని అత్యున్నత ప్రమాణాలతో కార్పొరేట్‌ హంగులతో నిర్మించాలని సూచించారు...

కొత్త ఆస్పత్రులకు కార్పొరేట్‌ హంగులు

  • నిర్మాణంలో రాజీ వద్దు.. కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష
  • 3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • రైతు ఇంటికే ఎరువులు.. హోమ్‌ డెలివరీకి శ్రీకారం
  • 56 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సీఎం జగన్‌ ఆదేశించారు. వీటిని అత్యున్నత ప్రమాణాలతో కార్పొరేట్‌ హంగులతో నిర్మించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త మెడికల్‌ కాలేజీలతో పాటు ఆస్పత్రుల్లో అమలవుతున్న ‘నాడు-నాడు’పై సీఎం చర్చించారు. కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల్లో రోగులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం జరగాలని సూచించారు. మూడేళ్లలో వీటి నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో సెంట్రలైజ్డ్‌ ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్‌, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్వి్‌పమెంట్‌ వంటి అన్నింటి నిర్వహణను ఆయా సంస్థలకు ఏడేళ్ల పాటు అప్పగించాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లకు మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించాలని, ఎక్కడా ఇబ్బందులు పడకుండా సేవలు అందించగలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులకు అవసరమైతే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, దానివల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50కే వస్తుందని సీఎం చెప్పారు.  


జ్యుడీషియల్‌ రివ్యూకు టెండర్లు

బోధనాస్పత్రుల నిర్మాణానికి సంబంధించి దాఖలైన టెండర్లను జ్యుడీషియల్‌ రివ్యూకు పంపుతున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందుల్లో వైద్య కళాశాలలకు సంబంధించి భూసేకరణతో పాటు అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. నరసాపురం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని కాలేజీల టెండర్లను నవంబరులో జ్యుడీషియల్‌ రివ్యూకు పంపుతామన్నారు. గిరిజన ప్రాంతాలైన.. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు సిద్ధమయ్యాయని తెలిపారు. కాగా, పాడేరులో నిర్మించనున్న బోధనాస్పత్రితో పాటు ఐటీడీఏల పరిధిలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను అక్టోబరు 2న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. 


మంచి పనులకు మద్దతివ్వండి

కరోనా నియంత్రణకు ప్రభు త్వం కృషి చేస్తోందని.. దీనికి ప్రతిపక్షం సహా మీడియా సంస్థ లు మద్దతు తెలపాలని ఆరోగ్యశా ఖ మంత్రి ఆళ్ల నాని కోరారు. బుఽ దవారం విజయవాడలో  మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తగ్గి, రికవరీ రే టు పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో ప్ర తిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీడియా సపోర్టు చేయాలని కోరారు.



Updated Date - 2020-10-01T08:23:31+05:30 IST