రేపటి నుంచి కొత్త ఆహార భద్రత కార్డులు
ABN , First Publish Date - 2021-07-25T15:15:02+05:30 IST
ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు.
హైదరాబాద్ సిటీ : ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని సీఆర్ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. మొదటి విడతలో 50 వేల కార్డులను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. దశలవారీగా అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తామని డీఎస్ఓ రమేష్ తెలిపారు.