ఏపీలో పాత పథకాలకి కొత్త రంగులు..

ABN , First Publish Date - 2020-07-05T21:34:55+05:30 IST

అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ శాసనసభలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీలో పాత పథకాలకి కొత్త రంగులు..

అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ శాసనసభలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కనుక జగన్ రెడ్డిపై నైతిక బాధ్యత కూడా ఉంటుంది. అయినా ఒక కులంపై కోపంతో బంగారు బాతులాంటి అమరావతిని చంపుకోవడం వివేకమెలా అవుతుంది? ఇటు అమరావతి, అటు విశాఖ, కర్నూలు కూడా అభివృద్ధి చెందని పక్షంలో అందుకు సమాధానం చెప్పాల్సింది జగన్ రెడ్డి మాత్రమే. చారణ కోడికి బారణ మసాలా అన్నట్లుగా పాత పథకాలకు కొత్త రంగులు వేసి వాయిదాలలో నిధులు విడుదల చేయడాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటూ భారీ ప్రకటనలు జారీ చేస్తూ.. జగన్ అండ్ కో అంతా పచ్చగా ఉందని భావించుకోవచ్చు గాక.. ఏదో ఒక రోజు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. సమాజాన్ని సన్నజనం, దొడ్డజనంగా విభజించి ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుుంటున్నామని ఇప్పటికీ సంబరాలు చేసుకుంటూ ఉండవచ్చుగానీ.. అన్ని రోజులు ఒకేలా ఉండవు. రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నప్పటికీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధర్మం, న్యాయం రైతులవైపే ఉన్నాయి. వారికి న్యాయం చేయడానికి ఈ దేశంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఒకరు కాకపోతే మరొకరు వారికి రక్షణగా నిలబడతారు.

Updated Date - 2020-07-05T21:34:55+05:30 IST