Amaravathi: జూలైలో కొత్త బార్‌ పాలసీ

ABN , First Publish Date - 2022-05-31T18:13:41+05:30 IST

జగన్ (Jagan) ప్రభుత్వం జూలై (July)లో కొత్త బార్‌ పాలసీ (New Bar Policy)ని ప్రవేశపెట్టనుంది.

Amaravathi: జూలైలో కొత్త బార్‌ పాలసీ

Amaravathi: జగన్ (Jagan) ప్రభుత్వం జూలై (July)లో కొత్త బార్‌ పాలసీ (New Bar Policy)ని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు కొనసాగుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు రెన్యువల్‌ ఇస్తారనేదే కీలకం. ఐదేళ్లకిస్తే ఇక మద్య నిషేధం లేనట్లే!.. ఒకట్రెండు సంవత్సరాలంటే ఎవరూ ముందుకు రారు. దీంతో పాతవారికే మళ్లీ అవకాశం ఉందా? లేదా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎక్సైజ్‌ అధికారులు లైసెన్సు ఫీజులు భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. 50 వేల లోపు జనాభా ఉన్నప్రాంతాల్లో రూ. 20 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలలోపైతే రూ. 30 లక్షలు, 3 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ. 50 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2022-05-31T18:13:41+05:30 IST