నెల్లూరు (Nellore): దశాబాద్ధాల చరిత్ర గలిగిన తల్పగిరి రంగనాథస్వామి ఆలయం(Thalpagiri Ranganadha Swamy Temple)లో అపచారం జరిగింది. ఆలయ గోపురంపై శంకుచక్రాలకు వైసీపీ (Ycp) రంగులు పులమడం వివాదస్పదంగా మారింది. ఆలయం ఎదుట టీడీపీ (Tdp) శ్రేణులు భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంద్రధనస్సు రంగులు వేశామని మూడు రోజుల్లో పరిష్కరిస్తామని ఆలయ ఛైర్మన్ ఇలపాక శివచారి (Ilapaka Sivachari) చెప్పుకొచ్చారు. అయితే హిందూ సంఘాలు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి