నిండుకుండలా సోమశిల జలాశయం

ABN , First Publish Date - 2020-09-28T13:57:37+05:30 IST

సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది.

నిండుకుండలా సోమశిల జలాశయం

నెల్లూరు: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. 74 టీఎంసీల నీటి నిల్వతో సోమశిల నిండుకుండలా మారింది. దాదాపు లక్షా 20 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, లక్షా 20 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్ల నుంచి పెన్నా నది ద్వారా సముద్రానికి నీటిని విడుదల చేశారు. 

Updated Date - 2020-09-28T13:57:37+05:30 IST