NDTV Shares : న్యూఢిల్లీ టెలివిజన్(NDTV) షేర్లు నేడు దూసుకెళ్లాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం కంపెనీ షేర్లు ఆకాశాన్నంటాయి. గురువారం ఇంట్రా డే(Intra Day)లో 9 శాతం ర్యాలీ చేసి 13 ఏళ్ల గరిష్టం రూ.312.65కి చేరాయి. టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్, సాఫ్ట్‌వేర్ ప్రొడక్షన్ కంపెనీ స్టాక్(NDTV Stock) రెండు ట్రేడింగ్ రోజుల్లో 20 శాతం లాభపడింది. జూలై 25, 2022న చేరిన దాని గత అత్యధిక గరిష్టం రూ.303ను సైతం అధిగమించింది.
గడిచిన ఒక నెలలో ఎన్‌డీటీవీ మార్కెట్ ధర(NDTV Market Price) 85 శాతం జూమ్ చేసింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్(S&P BSE Sensex)లో 9.8 శాతం పెరిగింది. సెప్టెంబర్ 2008 నుంచి ఇది అత్యధికంగానే ట్రేడ్ అవుతూ వస్తోంది. కంపెనీ స్టాక్ జనవరి 4, 2008న రికార్డ్ గరిష్టా(Record High)నికి చేరింది. NDTV, జూలై 27, 2022న, ధరలో కదలికకు కారణాలేమీ కంపెనీకి తెలియవని, కంపెనీ షేర్ల ధరలో మూమెంట్‌ను ప్రభావితం చేసే ఎలాంటి సమాచారాన్ని తాము దాచి ఉంచలేదని స్పష్టం చేసింది.
న్యూస్ బ్రాడ్‌కాస్టర్ NDTV, దాని ప్రమోటర్‌లకు టేకోవర్ కోడ్ బహిర్గతం నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా జూలై 21న, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT) కాస్త ఉపశమనం అందించింది. ట్రిబ్యునల్ వాటిని 'ఎక్సెస్సివ్' అని పేర్కొంటూ మార్కెట్ రెగ్యులేటర్(Market Regulator) విధించిన జరిమానాలను కూడా తగ్గించింది.