హైదరాబాద్/హయత్‌నగర్ : పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి నగదు చోరీ చేశాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో నవీన్‌రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. కాగా ఇతను కొద్ది రోజుల క్రితం సంస్థకు చెందిన రూ. 50లక్షల నగదు తీసుకుని కనిపించకుండా పోయాడు. అతడికి ఫోన్ చేయాగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దాంతో సంస్థ సిబ్బంది హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.