ఎదురులేని నవీన్‌

ABN , First Publish Date - 2021-12-30T07:40:17+05:30 IST

ప్రొ. కబడ్డీ లీగ్‌ తాజా సీజన్‌లో ఢిల్లీ స్టార్‌ రైడర్‌ నవీన్‌కుమార్‌ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారంనాటి మ్యాచ్‌లో

ఎదురులేని నవీన్‌

బెంగాల్‌కు  ఢిల్లీ షాక్‌


బెంగళూరు: ప్రొ. కబడ్డీ లీగ్‌ తాజా సీజన్‌లో ఢిల్లీ స్టార్‌ రైడర్‌ నవీన్‌కుమార్‌ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారంనాటి మ్యాచ్‌లో ఏకంగా 24 పాయింట్లు కొల్లగొట్టాడు. దాంతో దబాంగ్‌ ఢిల్లీ 52-35 స్కోరుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌కు షాకిచ్చింది. అంతేకాదు గత సీజన్‌ ఫైనల్లో బెంగాల్‌ చేతిలో ఓటమికి ఢిల్లీ బదులు తీర్చుకుంది. మ్యాచ్‌ ఆరంభం నుంచే బెంగాల్‌ రక్షణశ్రేణిని కకావికలం చేసిన నవీన్‌ వరుస పాయింట్లతో ఢిల్లీని తిరుగులేని స్థితిలో నిలిపాడు. మరోవైవు బెంగాల్‌ కెప్టెన్‌ మణిందర్‌ సింగ్‌ 16 పాయింట్లు స్కోరు చేసినా జట్టును గెలిపించలేక పోయాడు. ఇక వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయం ఎరుగని ఢిల్లీ 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో బెంగాల్‌ ఐదో స్థానానికి పడిపోయింది. మ్యాచ్‌ ఆరంభంనుంచే అదరగొట్టిన ఢిల్లీ ప్రథమార్థం ముగిసే సరికి 33-15తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ద్వితీయార్థంలో పుంజుకున్న బెంగాల్‌ 22-34తో మ్యాచ్‌లోకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ విజయ్‌ సూపర్‌ 10 సాధించడంతో ఢిల్లీకి తిరుగులేకుండాపోయింది. 


మరో ‘టై’: ఇక గుజరాత్‌ జెయింట్స్‌-యూపీ యోధా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ 32-32తో టై అయింది. తొలి అర్ధభాగం ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయిన గుజరాత్‌ ఈ సీజన్‌లో రెండో పోరును టైగా ముగించింది. 

Updated Date - 2021-12-30T07:40:17+05:30 IST