నాట్స్ ఆధ్వర్యంలో 'మ్యాథ్ మ్యాజిక్ విత్ హ్యుమన్ కంప్యూటర్'

ABN , First Publish Date - 2020-09-18T17:37:59+05:30 IST

ఇప్పటివరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా గణితం అంటే భయపడే వారి కోసం వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్ జొన్నలగడ్డ(20)తో 'మ్యాథ్ మ్యాజిక్ విత్ హ్యుమన్ కంప్యూటర్' అనే కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు సిద్ధమైంది.

నాట్స్ ఆధ్వర్యంలో 'మ్యాథ్ మ్యాజిక్ విత్ హ్యుమన్ కంప్యూటర్'

ఇప్పటివరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా గణితం అంటే భయపడే వారి కోసం వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్ జొన్నలగడ్డ(20)తో 'మ్యాథ్ మ్యాజిక్ విత్ హ్యుమన్ కంప్యూటర్' అనే కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 19న భారత కాలమాన ప్రకారం రాత్రి 9.30 గంటలకు భాను ప్రకాష్‌తో ఈ లైవ్ వర్చువల్ సెషన్ ఉంటుందని నాట్స్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు మొదట https://tinyurl.com/NatsBhanu లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. 


ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి

www.nristreams.tv/nats-live

ఫేస్‌బుక్: www.natsworld.org/fblive, www.nristreams.tv/nats-live-facebook

యూట్యూబ్: www.nristreams.tv/nats-live-youtube


ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా మహిత అప్పసాని, సుచరిత జయంతి, సిద్దార్థ జయంతి, భవిష్ గుమ్మడి వ్యవహిరించనున్నారు. సమన్వయ సహకారం శ్రీధర్ అప్పసాని(నాట్స్ చైర్మన్), విజయ్ శేఖర్ అన్నె(నాట్స్ అధ్యక్షులు), గంగాదర్ దేసు, మురళీ కృష్ణ మేడిచెర్ల అందించనున్నారు.

   

కాగా, హైదరబాద్‌కు చెందిన 20 ఏళ్ల భాను ప్రకాష్ ఈ ఏడాది ఆగస్టులో లండన్‌లో జరిగి మైండ్ స్పోర్ట్స్ ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అలాగే 50 లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్, నాలుగు వరల్డ్ రికార్డ్స్ భాను సొంతం. అంతేగాక 15 దేశాలలో వర్క్‌షాప్స్ నిర్వహించారు.  



Updated Date - 2020-09-18T17:37:59+05:30 IST