కర్నూలు పాతబస్తీలో 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం

ABN , First Publish Date - 2020-06-01T05:02:24+05:30 IST

అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్)

కర్నూలు పాతబస్తీలో 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం

కర్నూలు: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఇటు భారత్‌లో కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సైతం అండగా నిలుస్తోంది. కరోనా లాక్‌డౌన్‌తో పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు, పేద కుటుంబాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసింది. ఇక్కడ వలస కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక పెద్దలు కొందరు నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి నిరుపేదలకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చారు. బాపయ్య చౌదరి సాయంతో స్థానిక పెద్దలు 500 కుటుంబాలకు ఆహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా స్థానిక నాయకులు గౌస్ దేశాయ్, రాధాకృష్ణ, రాజశేఖర్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. కరోనా వల్ల పనులు లేక ఉపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితుల్లో  తమకు అండగా నిలిచి సాయం అందించిన నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరికి నిరుపేదలు ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడో అమెరికాలో ఉంటున్నా.. ఇక్కడ తెలుగువారు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించి సాయం చేసిన బాపయ్య చౌదరిని స్థానిక నాయకులు ప్రశంసించారు. తెలుగు ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా తాము తోచిన సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.

Updated Date - 2020-06-01T05:02:24+05:30 IST