సివిల్ వివాదాల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్

ABN , First Publish Date - 2022-06-25T20:24:47+05:30 IST

సివిల్ కేసులు,చిన్నచిన్నవివాదాలకు సంబంధించిన కేసులను వెంటనే సెటిల్ చేసేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈనెల 26న ‘నేషనల్ లోక్ అదాలత్’ ఏర్పాటుచేస్తున్నట్టు మెంబర్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

సివిల్ వివాదాల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్

హైదరాబాద్: సివిల్ కేసులు,చిన్నచిన్నవివాదాలకు సంబంధించిన కేసులను వెంటనే సెటిల్ చేసేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈనెల 26న ‘నేషనల్ లోక్ అదాలత్’ ఏర్పాటుచేస్తున్నట్టు మెంబర్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలోని అన్ని స్ధాయిల్లో హైకోర్టు నుంచి తాలుకా స్ధాయిలోని కేసులన్నింటినీ ఈ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నారు. అలాగే క్రిమినల్ కేసులను చీఫ్ జస్టిస్, ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ల మార్గదర్శకంలో ఈ అదాలత్ నిర్శహిస్తున్నారు. 


లోక్ అదాలత్ లోకి వచ్చే కేసులను ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా, గతంలో కొన్ని పెండింగ్ కేసులకు వసూలుచేసిన ఫీజులనుకూడా లోక్ అదాలత్ లో పరిష్కరించాక వాటిని తిరిగి చెల్లించనున్నారు. అదే విధంగా సమస్య పరిష్కారమైనాక తిరిగి అప్పీల్ కు వెళ్లడానికి వీలుండదు. ఈ నేషనల్ లోక్ అదాలత్ ను వర్చువల్ గానూ, నేరుగా నిర్వహించనున్నారు.పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ కోరారు. సేవలను పొందాలనుకునే వారు మండలస్ధాయి, జిల్లా స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీని కానీ, జిల్లాల్లోని న్యాయ సేవా సదన్ కార్యాలయాల్లో సంప్రదించాలని అన్నారు. 

Updated Date - 2022-06-25T20:24:47+05:30 IST