ఏపీ పోలీస్ శాఖకు జాతీయ అవార్డుల పంట

ABN , First Publish Date - 2021-02-28T00:17:31+05:30 IST

ఏపీ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది.

ఏపీ పోలీస్ శాఖకు జాతీయ అవార్డుల పంట

అమరావతి: ఏపీ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. టెక్నాలజీ వినియోగంలో దేశానికి మరోసారి ఏపీ పోలీస్ శాఖ  ఆదర్శంగా నిలిచింది. జాతీయస్థాయిలో వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం పై డిజిటల్ టెక్నాలజి సభ జరిగింది. ఈ సభలో ఆయా శాఖలకు అవార్డులను ప్రకటించారు. దేశంలో ప్రకటించిన 12  అవార్డులలో నాలుగు అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక పోలీస్ శాఖగా ఏపీ పోలీస్ శాఖ   నిలిచింది. ఈ నాలుగు టెక్నాలజీ అవార్డులను డీజీపీ గౌతం సవాంగ్   అందుకున్నారు.


దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సెంట్రల్ లాక్ అప్ మానిటరింగ్ సిస్టం,4S4U  అవార్డులను  ఏపీ పోలీస్  సొంతం చేసుకుంది. మహిళలు, చిన్నారులు రక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే వివిధ జాతీయ స్థాయి సంస్థలు ప్రకటించిన  జాతీయ స్థాయి అవార్డులలో దిశ మొబైల్ అప్లికేషన్‌కు ఇది నాల్గవది.


 



దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్  వివిధ జాతీయ స్థాయి సంస్థల నుంచి ఇప్పటికే రెండు అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే ప్రధానమంత్రి మోడీ నుంచి ప్రత్యేకంగా ప్రశంసలను అందుకుంది.  

సెంట్రల్ లాక్ అప్ మానిటరింగ్ సిస్టం విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం,  మానవహక్కుల పరిరక్షణే  ధ్యేయంగా రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో ఆడియో, వీడియో, నైట్ విజన్లతో కూడిన  సీసీ కెమెరాల ఏర్పాటుకు  రెండవ సారి జాతీయ స్థాయిలో అవార్డును  ఏపీ పోలీస్ శాఖ సొంతం చేసుకుంది. 

4S4U  విధానం ద్వారా సామాజిక మద్యమాల్లో మహిళల పైన జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం ఏపి పోలీస్  ప్రవేశపెట్టిన 4S4U మరోసారి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకుంది. 

కేవలం 13 నెలల కాల వ్యవధిలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకొని ఏపీ పోలీస్ శాఖ  సరికొత్త చరిత్ర సృష్టించింది.  

అందుబాటులో ఉన్న అత్యంత  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు పారదర్శకత, జబాబుదారీతనం, సత్వరన్యాయం, త్వరితగతిన  మెరుగైన సేవలను అందిస్తున్న సిబ్బందిని  సీఎం జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. 

Updated Date - 2021-02-28T00:17:31+05:30 IST