కొవిడ్‌ చికిత్సకు నాట్కో ఔషధం

ABN , First Publish Date - 2021-05-04T07:55:49+05:30 IST

కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించడానికి నాట్కో ఫార్మాకు చెందిన బారిసిటినిబ్‌ మాత్రలకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి.

కొవిడ్‌ చికిత్సకు నాట్కో ఔషధం

  • బారిసిటినిబ్‌ మాత్రల అత్యవసర వినియోగానికి లైన్‌ క్లియర్‌ 
  • సీడీఎస్‌సీవో పచ్చజెండా
  • ఈ వారంలోనే మార్కెట్లోకి విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించడానికి నాట్కో ఫార్మాకు చెందిన బారిసిటినిబ్‌ మాత్రలకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. కరోనా రోగుల చికిత్సకు రెమ్‌డెసివిర్‌తో కలిపి ఈ ఔషధాన్ని వినియోగిస్తారని నాట్కో ఫార్మా తెలిపింది. 1, 2, 4 ఎంజీ మోతా దు కలిగిన బారిసిటినిబ్‌ మాత్రల అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) పచ్చజెండా ఊపిందని పేర్కొంది. ఈ వారంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తామని వెల్లడించింది. కాగా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ రోగుల్లో కీళ్ల నొప్పులు, మంటలు, వాపుల చికిత్సకు బారిసిటినిబ్‌ను వినియోగిస్తున్నారు. 

Updated Date - 2021-05-04T07:55:49+05:30 IST