బూస్టర్‌గా ముక్కు టీకా
ABN , First Publish Date - 2021-12-21T06:57:50+05:30 IST
భారత్ బయోటెక్ సంస్థ తాను తయారుచేస్తున్న ముక్కు టీకాను (ఇంట్రా నేజల్ టీకా) బూస్టర్ డోసుగా ఇవ్వడానికి సంబంధించి ఫేజ్-3 ట్రయల్స్‌కు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతి కోరింది. ట్రయల్స్‌లో ఈ టీకా సురక్షితమని తేలితే.. ఇప్పటికే కొవ్యాక్సిన్ రెండు డోసులు
3వ దశ ట్రయల్స్‌కు అనుమతివ్వండి
డీసీజీఐను కోరిన భారత్ బయోటెక్
కొవ్యాక్సిన్ షెల్ఫ్ లైఫ్ ఏడాదికి పెంపు
హైదరాబాద్, డిసెంబరు 20: భారత్ బయోటెక్ సంస్థ తాను తయారుచేస్తున్న ముక్కు టీకాను (ఇంట్రా నేజల్ టీకా) బూస్టర్ డోసుగా ఇవ్వడానికి సంబంధించి ఫేజ్-3 ట్రయల్స్‌కు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతి కోరింది. ట్రయల్స్‌లో ఈ టీకా సురక్షితమని తేలితే.. ఇప్పటికే కొవ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారికి బూస్టర్ డోసుగా ముక్కు టీకా ఇస్తారు. భారత్ బయోటెక్ ఇప్పటికే ఈ రెండు టీకాలతో ఫేజ్-2 ట్రయల్స్ నిర్వహించింది. కాగా.. 9నెలలుగా ఉన్న కొవ్యాక్సిన్ టీకా షెల్ఫ్ లైఫ్‌ను ఏడాదికి పెంచుతూ ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) అనుమతిచ్చింది. తమ టీకాకు ‘28 రోజుల మల్టీ డోస్ వయల్ పాలసీ’ అనుమతి కూడా ఉందని భారత్ బయోటెక్ వివరించింది. అంటే.. 20 డోసులు ఉండే వయల్‌ను ఒకసారి తెరిస్తే 20 మందికి ఇవ్వొచ్చు. ఒకవేళ మిగిలిపోతే.. దాన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేసి.. తర్వాతి రోజు ఇవ్వొచ్చు. ఇలా 28 రోజులపాటు నిల్వ చేయొచ్చు.