Abn logo
May 12 2021 @ 13:45PM

నర్సులకు 2 నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలి: నాదెండ్ల మనోహర్

అమరావతి: కరోనా సమయంలో రోగులకు నర్సులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరం గుర్తించి, గౌరవించాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ దగ్గర ఉన్న రోగులకు వారు కరుణతో సపర్యలు అందిస్తున్నారన్నారు. ‘సిస్టర్’ అని పిలవగానే తమ కుటుంబ సభ్యులుగా భావించి స్వస్థత కలిగే వరకూ సేవ చేస్తారని మనోహర్ పేర్కొన్నారు. కోవిడ్, ఐసీయూ వార్డుల్లో వారు ఎంతో సాహసంతో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇంత కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నర్సుల సేవలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. వారందరికీ ప్రోత్సాహకరంగా ఉండేలా రెండు నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.


Advertisement