సబ్‌ జైలును పరిశీలించిన జిల్లా జైళ్ల శాఖ అధికారి

ABN , First Publish Date - 2021-10-19T04:56:58+05:30 IST

సబ్‌ జైలును పరిశీలించిన జిల్లా జైళ్ల శాఖ అధికారి

సబ్‌ జైలును పరిశీలించిన జిల్లా జైళ్ల శాఖ అధికారి

 నర్సంపేట, అక్టోబ రు 18 : రెండురోజుల్లో నర్సంపేట సబ్‌ జైలు పునర్‌ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని జిల్లా సబ్‌జైళ్ల అధికారి హనుమాన్‌ ప్రసాద్‌ అన్నారు. పట్టణంలో మూతపడిన సబ్‌ జైలు ను ఆయన సోమవా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం మూతపడిన సబ్‌జైలును తిరిగి ప్రారంభించేందుకు జెళ్లశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రాగారాన్ని ఇటీవల కూల్చేయడంతో నర్సంపేట పరిధిలోని ఖైదీల తరలింపులో ఏర్పడిన ఇబ్బందులను గుర్తించి  సబ్‌ జైలు పునర్‌నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర జెళ్లశాఖ డీజీ డాక్టర్‌ జితేందర్‌, ఐజీ వై.రాజేశ్‌, డీఐజీ డాక్టర్‌ శ్రీనివా్‌సల ఆదేశాల మేరకు ఒకటి, రెండు రోజుల్లో సబ్‌జైల్‌ పునర్‌ నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో టీఎ్‌సపీహెచ్‌సీ డీఈ దేవేందర్‌, ఏఈ కే.రావు, వార్డర్లు సురేంద్రబాబు, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T04:56:58+05:30 IST