మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర బీజేపీ దిగజారింది: నారాయణస్వామి

ABN , First Publish Date - 2021-12-29T19:29:49+05:30 IST

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర బీజేపీ దిగజారింది: నారాయణస్వామి

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర బీజేపీ దిగజారిందని విమర్శించారు. సోమువీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా? లేక.. సారాయి దుకాణాలకు అధ్యక్షుడా? అంటూ ఎద్దేవా చేశారు.


తెలుగు సినిమా కూడా వారసత్వంగా మారిపోయిందని  నారాయణస్వామి విమర్శించారు. 50 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమపై 3 కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. కొత్తవారికి థియేటర్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాజకీయాల్లో వారసత్వం గురించి మట్లాడతారని... మరి సినీ రంగంలో వారసత్వం పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పేదవారికి సినిమా చూపిస్తారు.. వారిని మాత్రం ఆదుకోరన్నారు. అలాగే నిర్మాత నష్టపోయినప్పుడు హీరోలు ఆదుకోరన్నారు. హీరోలు తమ పారితోషికాన్ని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. సినిమా రంగంలో కొత్తవారికి అవకాశాలు లేవని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-29T19:29:49+05:30 IST