మీ అరాచకాల నుంచి రక్షించే యాప్‌ను ఆరంభించండి సీఎం సారూ!: నారా లోకేష్

ABN , First Publish Date - 2022-06-03T16:43:47+05:30 IST

‘మీరు, మీ పార్టీ నేత‌లు, పోలీసులు, వ‌లంటీర్లు చేస్తున్న అరాచ‌కాల నుంచి ర‌క్షించే యాప్ ఏదైనా ఉంటే ఆరంభించండి సీఎం సారూ!’ అంటూ ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొర పెట్టుకున్నారు.

మీ అరాచకాల నుంచి రక్షించే యాప్‌ను ఆరంభించండి సీఎం సారూ!: నారా లోకేష్

అమరావతి : ‘మీరు, మీ పార్టీ నేత‌లు, పోలీసులు, వ‌లంటీర్లు చేస్తున్న అరాచ‌కాల నుంచి ర‌క్షించే యాప్ ఏదైనా ఉంటే ఆరంభించండి సీఎం సారూ!’ అంటూ ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొర పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మ‌హిళా పోలీసుల అమాన‌వీయ ప్ర‌వ‌ర్త‌నతో స‌భ్య‌స‌మాజం త‌ల దించుకుందన్నారు. త‌న ఇంటిముందు స్థ‌లాన్ని పోలీసుల‌తో వ‌చ్చిన‌ రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుండ‌గా మీనాక్ష‌మ్మ, ఆమె కుమార్తె అడ్డుప‌డ్డారన్నారు. వారిని సాటి మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా మ‌హిళా పోలీసులు త‌మ చున్నీల‌తో బంధించ‌డం అరాచ‌క‌ పాల‌న‌లో మ‌రో అమాన‌వీయ ఘ‌ట‌నగా అభివర్ణించారు. దుర్మార్గ ప్ర‌భుత్వ తీరును ప్ర‌జ‌లంతా ఒక్క‌టై నిల‌దీయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇంకెన్నాళ్లీ దౌర్జ‌న్య‌పాల‌న‌?... అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-03T16:43:47+05:30 IST