ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2021-12-04T02:49:40+05:30 IST

జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించిందని టీడీపీ నేత నారా లోకేష్‌ తెలిపారు.

ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే: నారా లోకేష్‌

అమరావతి: జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించిందని టీడీపీ నేత నారా లోకేష్‌ తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్‌లో పవళిస్తున్న సీఎం జగన్‌రెడ్డి నిద్రలేవలేదని.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ రాజ్యసభలో ప్రకటించారని తెలిపారు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39 మంది జలసమాధి అయ్యారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని లోకేష్‌ స్పష్టం చేశారు. 8 గ్రామాలు పాక్షికంగానూ, 4 గ్రామాలు పూర్తిగాను దెబ్బతిన్నాయని చెప్పారు. రూ.1721 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని, సొంత జిల్లాలో ఇంత ప్రాణనష్టం జరిగితే నవ్వుతూ సెల్ఫీలు దిగడం.. ప్రశ్నించిన ప్రతిపక్షంపై నిందలు వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా విపత్తులు ఎదుర్కోవడానికి ముందుగా మేల్కొనాలని నారా లోకేష్‌ సూచించారు.

Updated Date - 2021-12-04T02:49:40+05:30 IST