Andhra news: నందిగామలో సైబర్ నేరగాడు జీవన్ కుమార్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-22T18:04:36+05:30 IST

సైబర్ నేరగాడు జీవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Andhra news: నందిగామలో సైబర్ నేరగాడు జీవన్ కుమార్ అరెస్ట్

నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): సైబర్ నేరగాడు(Cyber criminal) జీవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని దుంగల్ పూర్ వద్ద జీవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్స్, రూ.1.80లక్షల నగదును స్వాధీనం చేశారు. గత సవత్సరం డిసెంబర్‌లో చిల్లకల్లు పోలీస్ ష్టేషన్‌లో జీవన్‌పై  సైబర్ కేసు నమోదు అయ్యింది. అల్ట్రాటెక్ సిమెంట్‌లో పనిచేస్తున్న సంజయ్ మహేశ్వరి వద్ద నుండి ఓటీపీ ద్వారా రూ.2.40లక్షల నగదును సైబర్ నేరగాడు విత్ డ్రా చేసినట్లు నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. 

Updated Date - 2022-07-22T18:04:36+05:30 IST