హైదరాబాద్: ఏపీ రాజకీయాలు రోజు రోజుకు దిగజారుతున్నాయని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ఆయన ఖండించారు. ఏపీ అసెంబ్లీలో చెడు సంప్రదాయం మొదలైందని, వ్యక్తిగత దూషణలు సరికావన్నారు. శాసనసభ హుందాతన కోల్పోయిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలే కానీ తిట్లు ఉండకూడదని నాగబాబు సూచించారు.