పోస్టుల భర్తీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-05-29T05:57:55+05:30 IST

ఉన్నత విద్యకు పునాదిగా నిలిచే ఇంటర్మీడియట్ విద్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతం జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుంది?...

పోస్టుల భర్తీ ఎప్పుడు?

ఉన్నత విద్యకు పునాదిగా నిలిచే ఇంటర్మీడియట్ విద్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతం జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుంది? ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సులలో మంచి ర్యాంకు పొందాలంటే ఇంటర్ విద్యే కీలకం. జూనియర్ లెక్చరర్ పోస్టులను సగం ప్రత్యక్ష నియామకాల ద్వారా, మిగతా సగం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. కానీ ప్రత్యక్ష నియామకాలు జరగక పది సంవత్సరాలు, పదోన్నతులు నిర్వహించక ఇరవై సంవత్సరాలు దాటింది. అంటే ఒక తరం నాణ్యమైన విద్యను పొందే అవకాశం కోల్పోయింది. సొంత రాష్ట్రం సిద్ధించి ఏడు సంవత్సరాలయినా ఇంతవరకు ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఇప్పటికయినా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో ఉన్న అన్ని ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేసి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి.


-నాగ శ్రీనివాస్, చిన్నపెండ్యాల

Updated Date - 2021-05-29T05:57:55+05:30 IST