వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం బాధాకరం: నాదెండ్ల మనోహర్

ABN , First Publish Date - 2021-07-31T23:26:15+05:30 IST

వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం బాధాకరం: నాదెండ్ల మనోహర్

వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం బాధాకరం: నాదెండ్ల మనోహర్

అమరావతి: జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ని ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. జీతాలు ఇవ్వక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుని క్రమబద్ధీకరిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు జీతాల విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. 1100 మంది ఈ తరహాలో విధులు నిర్వర్తిస్తున్నా, పాఠాలు చెప్పిన గంటల లెక్కన రూ.10 వేల లోపు జీతాలు చెల్లించాల్సి ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ విస్మరించిందన్నారు. గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయం నుంచి జీతాల బకాయిలు ఉండిపోయాయన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే వీరికి బకాయిపడ్డ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీ కచ్చితంగా వీరికి అండగా ఉంటుందన్నారు.

Updated Date - 2021-07-31T23:26:15+05:30 IST